Hyderabad, సెప్టెంబర్ 11 -- కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో చిన్నప్పుడు తనను కాపాడిన పాప గురించి కార్తీక్ చెప్పడంపై జ్యోత్స్న ఆలోచిస్తుంది. అత్త దీప నీ కూతురు అని చెప్పడుగా. చెప్పాలంటే తెలిసి ఉండాలి. బావ ఎప్పుడు ఏదో ఒక కొత్త విషయం చెబుతున్నాడు అని జ్యోత్స్న అనుకుంటుంది. ఇంతలో దాసు కాల్ చేసి కాశీ యాక్సిడెంట్ గురించి చెబుతాడు.

ఏ దారి లేక కాల్ చేశాను. శివ నారాయణకు తెలియకుండా నువ్వే కాపాడలమ్మా. నాకున్నది వాడు ఒక్కడే. నిన్ను కూతురుగా చెప్పుకోలేను. ఏదో ఒకటి చేయమ్మా అని దాసు అంటే.. నేను నా తమ్ముడిని కాపాడుకుంటాను నాన్న. నువ్వు కంగారు పడకు. విషయం ఎవరికి చెప్పకు అని జ్యోత్స్న అంటుంది. దాంతో నీ మేలు అస్సలు మర్చిపోలేనమ్మా అని దాసు అంటాడు.

కాల్ కట్ చేసిన జ్యోత్స్న తెగ సంతోషపడుతుంది. నా పెళ్లి విషయం నాకు హెల్ప్ చేయరా అంటే దీపకు చేశావుగా. ఇప...