భారతదేశం, జనవరి 26 -- కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో దాసును కిడ్నాప్ చేసిన రౌడీలతో మాట్లాడి వెనక్కి తిరిగిన జ్యోత్స్నకు పారిజాతం కనిపిస్తుంది. దాంతో జ్యో షాక్ అవుతుంది. ఎవరని అడిగితే ఫ్రెండ్ అంటుంది. ఎవరు ఆపలేరంటున్నావ్ అని పారు అంటుంది. ఏదో అలా కౌంటర్ ఇచ్చానని చెబుతుంది జ్యోత్స్న.

దాసు ఇంటికి రావడం నిజంగా చూశావా. కావాలనే అబద్ధం చెప్పావా అని పారిజాతం డౌట్ పడుతుంది. నా జీవితం తలకిందులు అవుతుంటే హెల్ప్ చేయకపోవడం మాని అందరూ టార్చర్ చేస్తున్నారు అని రివర్స్‌లో కోప్పడుతుంది జ్యోత్స్న. ముందు దీన్ని ఎలా కాపాడాలో ఆలోచించాలి అని పారిజాతం అంటుంది.

తర్వాత జ్యోత్స్న రెడీ అవుతుంటే ఎక్కడికే అని అడుగుతుంది పారిజాతం. నేను ఎక్కడికి వెళ్లానో తెలియదని చెప్పు. డాక్టర్ రాదు, రిపోర్ట్స్ రావు అని జ్యోత్స్న అంటుంది. దాంతో ఏం చేశావే అని షాక్ అవుతుంది ...