భారతదేశం, సెప్టెంబర్ 2 -- కార్తీక దీపం 2 సీరియల్ టుడే సెప్టెంబర్ 2వ తేదీ ఎపిసోడ్ లో పెళ్లి ఆపాలనుకుంది ఎవరో నీ భర్తనే అడుగు చెప్తాడని దీపతో పారిజాతం అంటుంది. తాళి దాచింది ఎవరో మా బావకు తెలుసా? అని దీప అడిగితే.. తెలుసు అని పారు సమాధానం ఇస్తుంది. నాకు తెలియడం ఏంటీ పారు అని కార్తీక్ తడబడతాడు. అయితే తాళి తీసావని తెలుసు అత్త అని సుమిత్రతో మాట్లాడినప్పుడు పారిజాతం వింటుంది. ఇప్పుడు దశరథ సీరియస్ గా అడగ్గానే సుమిత్ర అని నిజం చెప్పేస్తుంది పారిజాతం. అందరూ షాక్ అవుతారు.

ఎవరి మీద ఎలాంటి నిందలు వేయాలో తెలియదా? అని పారును దీప అంటుంది. వదిన దేవతమ్మా, దేవత మీద నింద వేశావా? అని దాసు అంటాడు. పెద్దమ్మ తప్పు చేసిందంటే నేను చచ్చినా నమ్మను అని కాశీ చెప్తాడు. పారిజాతం ఇది అబద్ధమని చెప్పండని దీప అడుగుతుంది. కానీ కార్తీక్ తో తల్లి కాంచన మీద ఒట్టు వేయించి తాళి త...