భారతదేశం, నవంబర్ 6 -- కార్తీక దీపం 2 సీరియల్ టుడే నవంబర్ 6 ఎపిసోడ్ లో శివన్నారాయణ దగ్గరకు వెళ్లి పొగడ్తలతో బుట్టలో వేసేందుకు ప్రయత్నిస్తుంది పారిజాతం. చేతిలో చిడతలుంటే భజన సరిగ్గా సరిపోయేదని శివన్నారాయణ అంటాడు. కాళ్లు పడతానని పారు అంటుంది. సుమిత్ర, దశరథ కలిసిపోయారు కదా అందరూ సంతోషంగా ఉన్నారు. కానీ ఒక్కరు మాత్రం కాదు. అందుకే బోర్డు మీటింగ్ లో సీఈఓగా జ్యోత్స్న కొనసాగుతుందని చెప్పాలని పారు అడుగుతుంది.

పారు వెనకాల వచ్చి జ్యోత్స్న డోర్ దగ్గర నుంచి అంతా వింటుంది. జ్యోత్స్నకు నీ మీద నమ్మకం లేనట్లుంది. అందుకే వెనకాల వచ్చింది. జ్యోత్స్న ఇటు రా అని శివన్నారాయణ పిలుస్తాడు. ముందు సీఈఓ పోస్టుకు రాజీనామా చేయ్, మంచి సంబంధం చూసి పెళ్లి చేసుకో అని షాక్ ఇస్తాడు శివన్నారాయణ. కాస్త మీ అమ్మానాన్నలకు దూరంగా ఉండమని కూడా జ్యోత్స్నకు చెప్తాడు.

సీఈఓ విషయంలో తాత ...