భారతదేశం, జూలై 4 -- కార్తీక దీపం 2 సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో జ్యోత్స్నను వెనకేసుకొస్తూ దశరథ్ తో మాట్లాడుతుంది సుమిత్ర. ఏకంగా వాళ్లను తాతను తీసుకుని అత్తను చూడటానికి వెళ్లింది. దీని మనసు ఎలాంటిదో ఇంతకుమించిన రుజువు కావాలంటారా? అని సుమిత్ర చెప్తుంది. నన్ను ఇలా గుడ్డిగా నమ్మాలనే తాతను తీసుకెళ్లా అని జ్యో మనసులో అనుకుంటుంది. కానీ జ్యోత్స్నను మాత్రం నమ్మను అని దశరథ్ అనుకుంటాడు.

ఇంతలో రేపు అందరూ ఇంటి దగ్గరే ఉండాలి అని శివన్నారాయణ వచ్చి చెప్తాడు. గౌతమ్ పేరెంట్స్ తో వస్తున్నాడని, జ్యోత్స్న నిశ్చితార్థానికి ముహూర్తాలు పెట్టుకోవడానికి అని శివన్నారాయణ చెప్పగానే పారిజాతం, జ్యో షాక్ అవుతారు. జాగ్రత్తగా చూసుకోమని సుమిత్రకు చెప్తాడు శివన్నారాయణ. ఎందుకైనా మంచిది ఎస్ఐని అందుబాటులో ఉండమని చెప్పు అని దశరథ్ తో అంటాడు శివన్నారాయణ.

నిద్రపోవడానికి అందరూ గదుల్...