భారతదేశం, నవంబర్ 21 -- కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో జ్యోత్స్న సారీ చెప్పి కావేరి కాళ్లకు పసుపు రాస్తుంది. మిగతా వాళ్లకు కూడా రాయు అని సుమిత్ర అంటే.. నేను రాస్తాను అని దీప తీసుకుంటుంది. జ్యోత్స్న అంతా బాగానే చేసింది కానీ ఈ కార్తీక్ గాడు వచ్చి అంతా చెడగొట్టాడు అని పారిజాతం మనసులో అనుకుంటుంది. కాంచన కాళ్లకు పసుపు రాస్తుంది.

అది చూసి సుమిత్ర, దీప మురిసిపోతారు. కార్తీక్ సంతోషిస్తాడు. సుమిత్ర కాళ్లకు కూడా దీప పసుపు రాస్తుంది. ఎమోషనల్ అవుతుంది. కాంచనతో శ్రీధర్ గురించి శివ నారాయణ మాట్లాడుతాడు. ఆ మాటలు శ్రీధర్ వింటుంటాడు. శ్రీధర్ వింటుంది కార్తీక్ చూస్తాడు. శ్రీధర్ విషయంలో మార్పు చూసి అవమానించిన నేనే అధికారం ఇచ్చాను. నిన్ను ఒకటి అడగాలి. నీ భర్తను క్షమించలేవా అని శివనారాయణ అంటాడు.

నేను శ్రీధర్‌ను సీఈఓ చేయడానికి ఒక కారణం కార్తీక్ అయితే...