భారతదేశం, జూలై 16 -- కార్తీక దీపం 2 టుడే జూలై 16వ తేదీ ఎపిసోడ్ లో కాశీ గురించి జ్యోత్స్నతో మాట్లాడుతుంది దీప. దాసు బాబాయికి గతం గుర్తుకొచ్చిందని విన్నా అని జ్యోత్స్నను టెన్షన్ పెడుతుంది దీప. బాబాయిని కొట్టిన వాళ్లే నన్ను చంపాలని అనుకోవచ్చు, దశరథ్ ను షూట్ చేయొచ్చు కదా అని దీప అంటుంది. మా డాడీని షూట్ చేసింది నువ్వే అని అందరికీ తెలుసులే అని జ్యో అంటుంది. నిజాలు మట్టిలో పాతిన విత్తనాల్లాంటివి అవి ఏదో ఒక రోజు మొలకలై బయటకు వస్తాయని దీప వార్నింగ్ ఇచ్చినట్లు చెప్తుంది. తప్పుల నుంచి ఎంత తొందరగా బయటపడితే అంత మంచిది. మన తల్లిదండ్రులు మనల్ని కన్నందుకు బాధపడకూడదు. అలాంటి పరిస్థితి నీ తల్లిదండ్రులకు రానివ్వకు అని దీప వెళ్లిపోతుంది.

దశరథ, సుమిత్ర నీ కన్నవాళ్లు, నా కన్నవాళ్లు కాదు. నేను గౌతమ్ తో పెళ్లి నుంచి బయటపడతాను కానీ నింద నీ మీద పడేలా చేస్తాను. నే...