భారతదేశం, డిసెంబర్ 29 -- కార్తీక దీపం 2 టుడే డిసెంబర్ 29 ఎపిసోడ్ లో మొబైల్ రికార్డింగ్ ఆన్ చేసి జ్యోత్స్న రూమ్ లో పెడుతుంది దీప. జ్యో తన గదివైపు పరుగెత్తుకుంటూ వస్తుంది. జ్యోకు కనిపించకుండా దీప వెళ్లిపోతుంది. దీప నా రూమ్ లోకి వెళ్లిందని గ్రానీ చెప్పింది. మరి బావకు వైరా గురించి తెలిసిపోయిందా? కాశీ నిజం చెప్పాడా? నన్ను వైరా మోసం చేస్తున్నాడా? అని జ్యో అనుకుంటుంది.

వైరాకు జ్యోత్స్న కాల్ చేస్తుంది. అప్పుడే రికార్డింగ్ ఆన్ చేసి పెట్టిన కార్తీక్ ఫోన్ ను చూసి కాల్ కట్ చేస్తుంది జ్యో. వైరా కాల్ చేస్తే బావకు అనుమానం రాకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటానని జ్యో అనుకుంటుంది. వైరా ఎవరో తెలియనట్లు ఆమె మాట్లాడుతుంది. వైరా నువ్వు ఎంత ట్రై చేసినా మా కంపెనీలో అడుగుపెట్టలేవు? మా మామయ్య తప్పు చేసినంత మాత్రాన రెస్టారెంట్ మూసేస్తా అనుకుంటున్నావా? అది నాదే. డబ...