భారతదేశం, జూలై 14 -- కార్తీక దీపం 2 సీరియల్ టుడే జూలై 14వ తేదీ ఎపిసోడ్ లో శివన్నారాయణ ఇంట్లో జరిగింది గుర్తు చేసుకుంటూ కార్తీక్, దీప స్కూటీపై వెళ్తారు. మధ్యలో మొక్కజొన్న పొత్తుతో కార్తీక్ ను కూల్ చేయాలని చూస్తుంది దీప. అత్త చీర తీసుకుని అమ్మకు ఇవ్వమంటే ఇవ్వొచ్చుగా అని దీప మీద కాస్త కోపం చూపిస్తాడు కార్తీక్. నీ మీద కోపాన్ని మా అమ్మ మీద అత్తయ్య ఎందుకు చూపించాలి? ఇక శివన్నారాయణకు ఈగో అని కార్తీక్ అంటాడు. అయిపోయింది వదిలేయ్ అని దీప చెప్తుంది.

కార్తీక్ ను కూల్ చేస్తుంది దీప. నువ్వు అందగాడివి బావ అని అంటుంది వంటలక్క. మరోవైపు దీప జడలో కార్తీక్ రోజా పెట్టడం గుర్తు చేసుకుంటూ జ్యోత్స్న మండిపోతుంది. అప్పుడే గౌతమ్ తన గదిలోకి రావడంతో జ్యో షాక్ అవుతుంది. ప్రైవేటుగా మాట్లాడదామని వచ్చా అని చెప్పి జ్యో చేయి పట్టుకుంటాడు గౌతమ్. కంగారు పడ్డ జ్యో.. పారిజాతా...