Hyderabad, ఆగస్టు 14 -- కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో కార్తీక్, దీప పెళ్లికి రెండు రోజుల్లో దివ్యమైన ముహుర్తం ఉందని పంతులు చెబుతాడు. దానికి అంతా ఒప్పుకుంటారు. లగ్న పత్రిక పెట్టి మా నాన్నకు ఇవ్వండి అని కాంచన అంటుంది. ఏర్పాట్లు అన్ని మేము చూసుకుంటాం. మీరు వస్తే సరిపోతుందని దశరథ్ అంటాడు. అంతా వెళ్లిపోతుంటే ఇంకా మనం వచ్చిన పని అయిపోయిందనుకుంటున్నారా అని జ్యోత్స్న అంటుంది.

బావ పెళ్లిలో కన్యదానం ఎలా చేస్తారు అని జ్యోత్స్న అంటుంది. పెళ్లి కూతురు అమ్మ నాన్న పెళ్లి కొడుకు కాళ్లు కడిగి కన్యాదానం చేస్తారు అని కాంచన అంటుంది. చాలా బాగా చెప్పావ్ అత్త. పెళ్లి కూతురును అమ్మనాన్న ఎవరికి అప్పజెప్పాలి పెళ్లి కొడుకుకి. మరి పెళ్లి కూతురును అందుకునే స్థానంలో ఎవరు కూర్చోవాలి అని జ్యోత్స్న అంటుంది. ఇంకెవరు పెళ్లి కూతురు అమ్మ.. నా.. అని కాంచన ఆగిపోతుం...