Hyderabad, ఆగస్టు 30 -- కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో కార్తీక్ ఇంట్లో సత్యనారాయణ వ్రతానికి దాసు, శ్రీధర్ వస్తారు. దీప మెడలో తాళి చూస్తూ జ్యోత్స్న రగిలిపోతుంది. అది చూసిన దీప ఏంటీ అలా చూస్తున్నావ్ అని అడుగుతుంది. చిన్నప్పుడు అదృష్టం గురించి విన్నాను. నిన్ను చూస్తుంటే తెలుస్తోంది అని జ్యోత్స్న అంటుంది.

నాకంటే అదృష్టవంతురాలివి నువ్వు. నీ దగ్గర తల్లిదండ్రులు ఉన్నారు. అందుకే వారి విలువ నీకు తెలియదు అని దీప అంటుంది. నేను అదృష్టవంతురాలిని కాబట్టే దాసు కూతురులా పెరిగే నేను దశరథ్ కూతురిలా పెరిగా. నువ్వు కుబేరా కూతురిలా పెరిగావ్. ఈ తాళి కూడా నీ మెడలో ఎక్కువ కాలం ఉండదు. నీది అనేది నాకు దక్కాలని విధి ఎప్పుడు రాసి పెట్టి ఉంది అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న.

పారు హడావిడి చేస్తే కార్తీక్ డౌట్ పడతాడు. ఇంతలో శివ నారాయణ వాళ్లు వస్తారు. దాసున...