భారతదేశం, జనవరి 21 -- కార్తీక దీపం 2 టుడే జనవరి 21 ఎపిసోడ్ లో కార్తీక్ చిన్నప్పటి అమ్మాయి గెటప్ ఫొటో గురించి చెప్పమని దీప అడుగుతుంది. అప్పుడు సుమిత్ర నవ్వుతూ కాంచన వదినకు ఆడపిల్లలంటే చాలా ఇష్టం. కార్తీక్ ను ఆడపిల్లగా రెడీ చేసేది. వీడికి జుట్టు పెంచి జడలు వేసేది. పూలు పెట్టేది. ఒక పండగ రోజు వీడిని ఆడపిల్లలా రెడీ చేశారు. అయితే ఆట మధ్యలో ఒక అబ్బాయి వీడిని పెద్దయ్యాక పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. బుగ్గ మీద ముద్దు కూడా పెట్టుకున్నాడని సుమిత్ర చెప్తే అందరూ నవ్వేశారు.

ఆ తర్వాత బావ గుండు చేయించుకున్నాడని జ్యోత్స్న చెప్తుంది. గుండుతో ఉన్న ఫొటో ఉందా అని దీప అడిగితే, రా ఉంది చూపిస్తానని సుమిత్ర చెప్తుంది. సుమిత్ర నవ్వుతూ దీపతో మాట్లాడుతుంది. ఎంత బాధను లోపల పెట్టుకుని పైకి నవ్వుతున్నావో నాకు తెలుసురా. నీ వల్లే సుమిత్ర నవ్వడం చూస్తున్నానని కార్తీక్ క...