భారతదేశం, డిసెంబర్ 31 -- కార్తీక దీపం 2 టుడే డిసెంబర్ 31 ఎపిసోడ్ లో కార్తీక్ రోడ్డులో కారు ఆపి జ్యోత్స్ను దిగమంటాడు. స్కూల్ లో ఉన్నప్పుడు తెలుగు వాచకం అనే పుస్తకం మన ఇంట్లో దొరికింది. అందులో చెట్టు ఎక్కిన వ్యక్తి కూర్చున్న కొమ్మను నరుక్కునే ఫొటో చూశా. ఆ తర్వాత తెలిసింది. వాడిని వాడే నాశనం చేయాలనుకునేవాణ్ని మూర్ఖుడు అంటారు. వైరా నిన్నే ఎందుకు వేలు ఎత్తి చూపించాలని కార్తీక్ అడుగుతాడు.

కాశీకి జాబ్ రావడానికి హెల్ప్ చేయలేదా? వైరాతో ఫోన్లో మాట్లాడలేదా? వైరాతో మా నాన్నను సీఈఓ పోస్టులో నుంచి దించాలని అడగలేదా? ఫుడ్ కల్తీ చేయమని చెప్పలేదా? అని కార్తీక్ అడిగితే, లేదు లేదు అని జ్యోత్స్న సమాధానం చెబుతుంది. తప్పు చేశానని ఒక్క సాక్ష్యం చూపించమని చిటికెలు వేసి ఛాలెంజ్ చేస్తుంది జ్యో. ఇందులో నీ హ్యాండ్ ఉందని నిరూపిస్తే ఏం చేస్తావని కార్తీక్ అడుగుతాడు.

శ...