భారతదేశం, జూలై 11 -- కార్తీక దీపం 2 ఈ రోజు ఎపిసోడ్ లో జ్యోత్స్న కంగారుగా వెళ్లి తన గదిలో ఉంగరాల కోసం వెతుకుతుంది. కానీ అవి టెడ్డీ బేర్ లోపల కనిపించవు. నేను నా ఎంగేజ్మెంట్ చెడగొట్టాలనుకుంటున్నట్లు బావకు తెలిసిపోయింది అని జ్యో అనుకుంటుంది. అప్పుడే ఆవేశంగా వచ్చిన పారిజాతం జ్యోను లాగిపెట్టి కొడుతుంది. గ్రానీ అని జ్యో అరిస్తే.. అరిస్తే బీపీ పెరిగిపోతుంది, వరుస పెట్టి ఉతుకుతూనే ఉంటా అని పారు అంటుంది.

నన్ను ఎందుకు కొట్టావో చెప్పు అని జ్యో అడుగుతుంది. నువ్వు తప్పించుకోవడం కోసం పక్కోడు చచ్చినా పర్లేదా? అని పారు ఫైర్ అవుతుంది. చూస్తుంటే దీప, కార్తీక్ నన్ను బయటకు పంపించేలా ఉన్నారని జ్యో అంటుంది. నిన్నెందుకు పంపిస్తారు అని పారు అడిగితే.. నేను అసలైన వారసురాలిని కాదు కాబట్టి, ఈ విషయం వాళ్లకు తెలిసి ఉంటే అని జ్యో చెప్తుంది. ఇంత పెద్ద నిజం తెలిస్తే ఎందు...