భారతదేశం, జనవరి 1 -- కార్తీక దీపం 2 టుడే జనవరి 1 ఎపిసోడ్ లో జ్యోత్స్నను చెంపదెబ్బ కొడుతుంది పారు. నువ్వు చేసిన పాపల పుట్ట ఎక్కడ భయపడుతుందనే భయం. మీ తమ్ముడిని అడ్డుపెట్టుకుని వైరాను మోసం చేశాడు ఓకే. కానీ నేరం నెత్తిమీద పెట్టుకుని నా మనవడు కూడా స్టేషన్లో ఉన్నాడు. నా మనవడికి కూడా శిక్ష పడుతుంది కదా అని పారు సీరియస్ అవుతుంది.

నా తమ్ముడిని కాపాడుకోనా అని జ్యోత్స్న అంటుంది. మరి అందరి ముందు ఎందుకు ఒప్పుకోలేదని పారిజాతం అంటే, అలా చేస్తే పోలీసులు నన్ను అరెస్ట్ చేసేవారని జ్యో చెప్తుంది. దరిద్రం వదిలిపోయేది. కార్తీక్ గాడు వాళ్ల నాన్నను నిర్దోషిగా విడిపించుకున్నాడు. కానీ నువ్వు సొంత తమ్ముడిని మోసం చేశావు. జీవితమే లేకుండా చేశావని పారు అంటుంది. నా తమ్ముడు దెబ్బతిన్న పులి. ఎవరు ఎలాంటి వాళ్లో వాడికి బాగా తెలిసిందని జ్యో అంటుంది.

కాశీ, నేను ఒక్క తల్లికి...