Hyderabad, సెప్టెంబర్ 27 -- కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో కాశిని స్వప్న నిద్రలేపుతుంటే లేవడు. ఇదే జాబ్ ఉన్నప్పుడు ఈపాటికి లేచి రెడీ అయి అది ఉందా ఇది ఉందా అడిగేవాడివి అని నార్మల్‌గా గుర్తు చేసుకుంటుంది స్వప్న. దానికి స్వప్నపై కోప్పడతాడు కాశీ. ఇప్పుడు జాబ్ లేదని అంటున్నావా. జాబ్ గురించి ఆలోచిస్తే నిద్ర పట్టలేదు. నాలుగింటి వరకు అలాగే ఉన్నా. ఇప్పుడే కాస్తా నిద్రపట్టింది. ఇప్పుడు నువ్వు ఇలా అంటే ఎలా ఉంటుంది అని కాశీ అంటాడు.

కాశీ మాటలు శ్రీధర్, కావేరి వింటుంటారు. జాబ్ లేదు కాబట్టే ఇలా అంటున్నావ్. అదే వర్క్ ఫ్రమ్ హౌమ్ చేసి పడుకుంటే వేరేలా అనేదానివి. జాబ్ లేనివాడు 9 దాకా పడుకోడానికి రైట్ లేదు అని కాశి అంటాడు. సరే. నీ జోలికే రాను. ఈ రూమ్‌లోకే రాను అని స్వప్న అంటుంది. దానికి అల్లుడితో జాగ్రత్తగా మాట్లాడమని నీ కూతురుకు చెప్పు. జాబ్ లేనివ...