భారతదేశం, మే 22 -- కార్తీక దీపం 2 నేటి (మే 22, 2025) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. కార్తీక్, దీపకు తన చేతులతో అవార్డు ఇచ్చిన శివన్నారాయణ ఇంటికి వచ్చి రగిలిపోతాడు. జ్యోత్స్నపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. "గాలి మాటలు చెప్పడం. ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పడం కాదు గెలుపంటే. ఈరోజు కార్తీక్ గాడు మనకు చూపించాడు చూడు అదే గెలుపంటే. అటవైపు కన్నెత్తి కూడా చూడకూడదు అనుకున్నా" అని జ్యోత్స్నపై శివన్నారాయణ ఫైర్ అవుతాడు. నీ మనవడికి అవార్డు రావడం ఓర్వలేక నీ మనవరాలిని పంపావా అని అడిగాడని కోప్పడతాడు.

గోరు చుట్టు మీద రోకలి పోటులా.. సగం ఇక్కడే చచ్చి బయలుదేరా.. మిగిలిన సగం అక్కడ చంపారు అంటూ జోత్స్నకు చివాట్లు పెడతాడు శివన్నారాయణ. తాత అని జ్యో.. తాత లేదు.. పీత లేదు ముందు ఆ అగ్రిమెంట్ కథేంటో చెప్పు అని శివన్నారాయణ అడుగుతాడు. అగ్రిమెంట్ ఏంటి అని దశరథ్, సుమిత్ర అడుగుతారు. ...