భారతదేశం, నవంబర్ 3 -- కార్తీక దీపం 2 సీరియల్ టుడే నవంబర్ 3 ఎపిసోడ్ లో అమ్మలాంటి అత్తకు ఎంతో రుణపడి పోయా. ఆ రుణాన్ని ఎంతో కొంత తీర్చుకోగలిగితే చాలని కార్తీక్ అంటాడు. మనవడికే కాదు మనవరాలికి కూడా చాలా చెప్పా. ఎవరికి ఏం అవసరమో అది మాత్రమే గుర్తు పెట్టుకుంటారని శివన్నారాయణ అంటాడు. అందరు కలిసి జోకర్ ను చేశారు. బావకు, దీపకు ఎక్కడ నిజం తెలిసిపోయిందోననే కొత్త భయం పట్టుకుందని జ్యోత్స్న అనుకుంటుంది.

పెళ్లి రోజు సందర్భంగా దశరథ, సుమిత్రతో దండలు మార్పిస్తాడు కార్తీక్. నా మనసులోని మాట చెప్తా. మనిషి శరీరంలో ప్రాణం ఎక్కడుంది అంటే? గుండె ఆగిపోతే ప్రాణం పోతుంది. ప్రాణం గుండెలోనే ఉంది. గుండె ఉన్నా ప్రాణం పోతుంది. అదెప్పుడూ ఊపిరి ఆగినప్పుడు. ప్రాణం ఊపిరిలో ఉంది. భార్యకు ఊపిరి భర్తే. ఓ కఠిన మాట తీసుకునే ఊపిరిని కూడా ఆపేస్తుంది. మాట అనిపించుకునేంత వరకూ తీసుకుర...