భారతదేశం, అక్టోబర్ 14 -- కార్తీక దీపం 2 టుడే అక్టోబర్ 14వ తేదీ ఎపిసోడ్ లో దీప అనే అనాథకు మీరు అమ్మానాన్నగా మారి పెళ్లి చేశారు. ఆ పెళ్లిలో అమ్మ ఓ తప్పు చేసింది. అత్తకు సారీ చెప్పింది. కానీ ఇంకా ఎన్నాళ్లు దూరంగా ఉంటారు. మా మమ్మీ తరపున ఈ ఇంట్లో నిలబడేది నేను తప్ప ఎవరూ లేరు. నువ్వు మా మమ్మీకి అలాంటి పరిస్థితి తీసుకొచ్చావు డాడీ. మమ్మీకి నువ్వుంటే ఎంత ప్రేమో నేనంటే కూడా అంతే ప్రేమ. నీ విషయంలో నన్ను కొట్టి నా మీద కంటే నీ మీదే ప్రేమ ఎక్కువని ప్రూవ్ చేసిందని జ్యోత్స్న అంటుంది.

మమ్మీ ప్రేమ దీపకు నీ మీద ఉన్న నమ్మకం ముందు ఓడిపోయింది డాడీ అని జ్యోత్స్న అంటుంది. ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదని కార్తీక్ అంటాడు. మమ్మీ, డాడీని కలపడానికి ట్రై చేస్తుంటే మధ్యలో నీకేంటి బావ అని అడుగుతుంది జ్యోత్స్న. నువ్వు కలుపుతున్నట్లు లేదంటాడు కార్తీక్. మీ ఇద...