Hyderabad, జూలై 18 -- కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో గౌతమ్ గాడు పెద్ద ఎధవ. వాడి గురించి చెబితే వాళ్లు నమ్మని నమ్మకపోని కానీ, నేను మాత్రం చెబుతాను. నా పుట్టింట్లో కన్నీళ్లు తిరగడం చూడలేను. చెబుతాను అని అనసూయ అంటుంది. గౌతమ్, జ్యోత్స్న ఇద్దరు బయటపడరని, జ్యోత్స్నతోనే నిజం చెప్పించాలి. దానికి ఈ ఎంగేజ్‌మెంట్ ఒక్కటే దారి అని కార్తీక్ నచ్చెజెప్పుతాడు.

మళ్లీ పాత రోజులు తీసుకొస్తాను అని కార్తీక్ అంటే వీళ్లిద్దరు అనుకుంది సాధించారు. ఇది కూడా సాధిస్తారు. కార్తీక్ అన్నది జరిగితే నీకు పూలు జల్లి మరి ఇంటికి ఆహ్వానిస్తారు. దీపను గొప్పగా చూస్తారు అని కాంచన అంటుంది. మీరంతా ధైర్యంగా ఉంటే చాలు అని కార్తీక్ అంటాడు. మరోవైపు తండ్రి దాస్ వచ్చాడని శ్రీధర్ చెబితే తెలిసిందని, లగేజ్ సర్దుకున్నామని కాశీ చెబుతాడు.

ఇంతలో కాశీకి కార్తీక్ కాల్ చేస్తాడు. గౌతమ్...