భారతదేశం, డిసెంబర్ 9 -- కార్తీక దీపం 2 టుడే డిసెంబర్ 9 ఎపిసోడ్ లో పెళ్లికి ఒప్పుకున్నావ్ కదా షాపింగ్ కు ఎప్పుడు వెళ్దామని జ్యోత్స్నను పారిజాతం అడుగుతుంది. డాడీ అడిగారని ఒప్పుకున్నా, ఏదీ జరిగే వరకూ నిజం కాదు గ్రానీ అని జ్యో షాక్ ఇస్తుంది. నేను చాలా ఆశలు పెట్టుకున్నానని జ్యో అంటే, నీ ఆశలను నిజం చేసే దారి నేను వేశానని కాంచన, శౌర్య మనసుల్లో విషం నింపిన సంగతి చెప్తుంది పారు.

ఇప్పుడు కార్తీక్ గాడికి కొత్త తలనొప్పులు స్టార్ట్ అవుతాయి చూడు అని పారు అనగానే శౌర్యను తీసుకుని కార్తీక్, దీప వస్తారు. శౌర్య రాగానే నాకు నువ్వు వద్దు అని శివనారాయణను పట్టించుకోకుండా హాయ్ జోగు రాణి అని పారిజాతాన్ని కౌగిలించుకుంటుంది. దీంతో శివనారాయణ, జ్యో ఆశ్చర్యంతో చూస్తారు. శౌర్య ప్లాన్ స్టార్ట్ చేసిందని కార్తీక్ చూస్తాడు. చిన్నపిల్లలు వాళ్ల మనసుకు నచ్చినవాళ్ల దగ్గరకే వస...