భారతదేశం, అక్టోబర్ 30 -- కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో కార్తీక్, దశరథ్ గుడిలో సుమిత్ర గురించి మాట్లాడుకుంటారు. ఆ మాటలు సుమిత్ర వింటుంది. ఇంతలో సుమిత్రను కార్తీక్ చూస్తాడు. చెప్పకు అని కార్తీక్‌ను వేడుకుంటుంది సుమిత్ర. దశరథ్ బాధపడుతుంటాడు. సుమిత్ర వెళ్లిపోతుంది. వాటర్ బాటిల్ తీసుకొస్తానని వెళ్తాడు.

మరోవైపు ఇవాళ అయిన కొడుకు, కోడలు ఒక్కటవ్వాలని శివ నారాయణ అనుకుంటాడు. ఇంతలో పారిజాతం వచ్చి కాఫీ ఇస్తుంది. నేను ఒక కాల్ కోసం చూస్తున్నా. అది జరగకపోతే ఈ విషాన్ని తాగుతాను అని శివ నారాయణ అంటాడు. తర్వాత పారిజాతంపై సెటైర్లు వేస్తాడు శివ నారాయణ. జ్యోత్స్న గురించి శివ నారాయణ అడిగితే.. ఆఫీస్‌కు వెళ్లిందని చెబుతుంది పారు.

ఎక్కడ ఏ అఘాయిత్యాలు చేస్తుందో అని శివ నారాయణ అనుకుంటాడు. మరోవైపు సుమిత్రతో కార్తీక్ మాట్లాడతాడు. మీ అత్త మొహం చూసే అర్హత కూ...