భారతదేశం, జూన్ 20 -- కార్తీక దీపం 2 సీరియల్ ఈ రోజు ఎసిసోడ్ లో నేను నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని చంపేశావ్, అంతకుమించిన హత్య లేదు, అంతకుమించిన నేరం లేదు అందుకే నువ్వొక హంతకురాలివి అని దీపతో కోపంతో సుమిత్ర అని లోపలికి వెళ్లిపోతుంది. ఈ మాటలను భరించలేని దీప కన్నీళ్లు పెట్టుకుంటుంది. కానీ నా భార్యను భోజనం తినేలా చేసినందుకు కార్తీక్, దీపకు దశరథ్ థ్యాంక్యూ చెప్తాడు. వంటలు బాగున్నాయని దశరథ్ అంటే చాలా వరస్ట్ గా ఉన్నాయని జ్యోత్స్న వెళ్లిపోతుంది. పారిజాతంతో వెటకారాన్ని కొనసాగిస్తాడు కార్తీక్.

పెద్ద మేడం మేం ఒకటి కాదు కదా పందెం అంటే పందెం అని కార్తీక్ గుర్తు చేస్తాడు. మన పందెం కోపం గురించి కాదు భోజనం గురించి అని జ్యోత్స్నకు చెప్తాడు కార్తీక్. చిన్న మేడం కడుపు నిండా భోజనం తిన్నారు కాబట్టి గుంజీలు తీయాల్సిందేనని కార్తీక్ ఖరాకండీగా చెప్పేస్తాడు. అందరిన...