Hyderabad, ఆగస్టు 15 -- కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో శ్రీధర్ దగ్గరికి కాంచన, కార్తీక్ ఇద్దరు వెళ్తారు. దీప తాళి జ్యోత్స్న తెంచడం గురించి అడుగుతాడు శ్రీధర్. కావేరి వచ్చి మర్యాదలు చేస్తుంటే వీళ్లు నాకోసం వచ్చారు అని ఓవర్ చేస్తాడు శ్రీధర్. కార్తీక్, దీప పెళ్లి గురించి చెబుతుంది కాంచన.

నీ కోడలు నోటికొచ్చినట్లు మాట్లాడి ఉంటుంది. నా మేనకోడలు తాళి తెంచినట్లుంది అని శ్రీధర్ అంటాడు. మాస్టారు ముందు చెప్పింది వినండి అని కోపంగా వీల్ చైర్ పట్టుకుంటాడు. శ్రీధర్ ఏం అన్నా అవేశపడకూడదని, అలా చేస్తే తన మీద ఒట్టే అని ఒట్టు వేయించుకుని కార్తీక్‌ను తీసుకొచ్చింది గుర్తు చేసుకుని ఆగిపోతాడు కార్తీక్. తర్వాత జరిగింది అంతా కాంచన చెబుతుంది.

దానికి విజిల్ కొడతాడు శ్రీధర్. నా మేనకోడలు పెట్టిన మెలికకు మీ మైండ్ బ్లాక్ అయి వచ్చారా అని శ్రీధర్ అంటాడు. కార్తీ...