Hyderabad, జూన్ 28 -- కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో తనను వెళ్లనివ్వకుండా ఆపింది మీరే కదా అని పారిజాతంను ఇరికిస్తుంది దీప. దాంతో అయితే సారీ చెప్పాల్సిందే అని శివ నారాయణ అంటాడు. సారీ చెప్పేవరకు వదిలేలా లేడు అని జ్యో, సారీ చెప్పాల్సిందే అని కార్తీక్ అనుకుంటారు. నా కూతురుని దారిలో పెట్టలాంటే వీళ్లే కరెక్ట్ అని దశరథ్ అనుకుంటాడు.

సారీ దీప. మరోసారి ఇలా జరగదు జ్యోత్స్న చెబుతుంది. తర్వాత గాజు ముక్కలను దీప క్లీన్ చేస్తుంటే దశరథ్ భోజనాలు అయ్యాక తీసుకోవచ్చని చెబుతాడు. ఆ కొన్నింటికి మనసు ఉండదు. అవి ఎవరినైనా గాయం చేస్తాయి. ఈ గాజు ముక్కులు కూడా అంతే. వీటిని మీరే కొన్నారు. మీరే తీసుకొచ్చారు. మీతోనే ఉన్నాయి కదా అని మీరనుకుంటారు. కానీ, ఇవి కాలు తగలగానే క్షణంలో గాయం చేస్తాయి. ఇలాంటివాటిని దూరంగా ఉంచాలి అని జ్యోను గాజు ముక్కలతో పోలుస్తుంది దీప. ...