భారతదేశం, జనవరి 14 -- కార్తీక దీపం 2 సీరియల్ టుడే జనవరి 14 ఎపిసోడ్ లో ఎవరైనా కొత్తవాళ్లు చూస్తే దీపనే సుమిత్ర కన్న కూతురు అనుకుంటారు. ఆ బాధ జ్యోత్స్నకు లేదు. అసలు జ్యోత్స్న మా వదిన కూతురా? కాదా? నాకెక్కడో అనుమానంగానే ఉందిరా. దానిలో మా అన్నయ్య, వదిన లక్షణాలు లేవు. ఇంకా వదినకు నిజం చెప్పలేవు కదా అని కార్తీక్ తో కాంచన మాట్లాడుతుంది.

రేపు చెప్పాలి. దీప నువ్వు ప్రిపేర్ గా ఉండావు. అత్తకు నిజం చెప్పినప్పుడు నువ్వు ఏడవొద్దని కార్తీక్ అంటాడు. మరోవైపు కాశీని జ్యోత్స్న కలుస్తుంది. నన్ను చాలా ప్లాన్ గా కేసులో ఇరికించి నువ్వు మాత్రం సైడ్ అయిపోయావ్. నువ్వు చెప్పకుండానే వైరా ఫుడ్ కల్తీ చేస్తాడా? అని కాశీ అడుగుతాడు. మరి ఎందుకు మీడియాకు నా పేరు చెప్పలేదని జ్యో అడుగుతుంది. నీ పేరు చెప్పినా నాకు శిక్ష తప్పదు. అదే చెప్పకుండా ఉంటే నా కోసం నిలబడతావని అనుకున్న...