భారతదేశం, నవంబర్ 17 -- కార్తీక దీపం 2 టుడే నవంబర్ 17 ఎపిసోడ్ లో ఆఫీస్ కు వెళ్లాలని హడావుడి చేస్తాడు కాశీ. నేను నీతో పాటు మీ ఆఫీస్ కు వస్తానని స్వప్న అంటుంది. జాబ్ చేసేవాళ్లకు కదా ప్రెషర్ ఉండాల్సింది నీకెందుకు ప్రెషర్? అని స్వప్న షాక్ ఇస్తుంది. విష్ణు కాల్ చేశాడా? ఆన్ లైన్ లో చూసి మీ ఆఫీస్ కు కాల్ చేశా. నీది విలువైన పోస్ట్ అంట కదా అని స్వప్న వెటకారంగా మాట్లాడుతుంది.

నిజం చెప్పమని తనపై ఒట్టు వేయించుకుంటుంది స్వప్న. జాబ్ వచ్చిందని చెప్పడం అబద్దమే అని కాశీ అనగానే స్వప్న ఎమోషనల్ అవుతుంది. ఈ విషయం నిన్న సాయంత్రమే తెలిసింది. నువ్వు చెప్తావేమోనని వెయిట్ చేశా. ఐ హేట్ యూ, నాతో మాట్లాడకు అని లోపలికి వెళ్లిపోతుంది స్వప్న. మరోవైపు గురువు గారికి జాతకాలు చూపిస్తాడు శివన్నారాయణ.

మీ కుటుంబానికి ఒక మంచి ఉంది. ఒక చెడు కూడా ఉంది. దోషం ఉంది అని శివన్నారాయణత...