Hyderabad, సెప్టెంబర్ 12 -- కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో ఇంట్లో కాశీ గురించి ఏడుస్తుంటుంది స్వప్న. ఇంట్లో బంధించి నాన్న ఎక్కడికో వెళ్లిపోయాడు అని అంటుంది స్వప్న. ఇంతలో శ్రీధర్ వచ్చి ఫోన్ ఇస్తాడు. పాలు ఇచ్చి కాఫీ పెట్టమంటాడు. అల్లుడు పోలీస్ స్టేషన్‌లో ఉంటే కాఫీ అంటారేంటీ అని కింద పడేస్తుంది కావేరి. తలనొప్పిగా ఉంది. కింద పడేస్తే పాలు విరిగిపోతాయేమో అని చాలా కూల్‌గా శ్రీధర్ చెబుతాడు.

ఈ మనిషి ఇంతే అమ్మా. ఇకనుంచి నాకు నాన్న లేడు. కాశీని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు అని స్వప్న అంటుంటే కాశీ ఎంట్రీ ఇస్తాడు. దాసుతో కాశీ వస్తుంటాడు. కాశీని చూసి స్వప్న తెగ సంబరపడిపోతుంది. నువ్ బయటకెళా వచ్చావ్. మావయ్య తీసుకొచ్చాడా. కొడుకును ఎలా కాపాడుకోవాలో మీకు తెలిసినట్లుగా ఇంకెవరికి తెలియదు అని ఇన్‌డైరెక్ట్‌గా తండ్రిని అంటుంది.

నేను తీసుకురాలేదు...