భారతదేశం, జూలై 2 -- కాంచ‌న‌కు ప్ర‌మాదం జ‌రిగితే దీప‌, కార్తీక్ ఇంటికి రాకుండా జ్యోత్స్న‌తో పాటు ఆమె కుటుంబ‌స‌భ్యులు అడ్డుకున్నార‌ని అపార్థం చేసుకున్న కాశీ శివ‌న్నారాయ‌ణ ఇంటికొచ్చి గొడ‌వ చేస్తాడు కాశీ. ఆ గొడ‌వ‌ను అడ్డుపెట్టుకొని కుటుంబ‌స‌భ్యుల ముందు దీప‌ను ఇరికిస్తుంది జ్యోత్స్న‌. దీప‌నే కాశీని రెచ్చ‌గొట్టి గొడ‌వ‌లు చేయిస్తుంద‌ని నింద‌లు వేస్తుంది.

న‌న్ను ఎవ‌రూ ర‌మ్మ‌ని చెప్ప‌లేద‌ని కాశీ అంటాడు. మ‌నుషుల‌ను కొట్టే అల‌వాటు, మాట‌ల‌తో బాధ‌పెట్టే అల‌వాటు మీ కుటుంబం మొత్తానికి ఉంద‌ని కాశీ అంటాడు. న‌న్ను ఏమైనా అను కానీ మా తాత‌ను ఏం అనొద్దు అని జ్యోత్స్న‌. ఆ పెద్ద మ‌నిషి వ‌ల్లే నువ్వు ఇలా త‌యారు అయ్యావ‌ని కాశీ బ‌దులిస్తాడు.

మాట‌లు మ‌ర్యాద‌గా మాట్లాడు అని కాశీకి వార్నింగ్ ఇస్తాడు కార్తీక్‌. వాడి చేత అనిపించేది నీ భార్య అంటూ సుమిత్ర కూడా అపార్థం చ...