భారతదేశం, ఆగస్టు 28 -- కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ లో దీపను కార్తీక్ కు అప్పగిస్తాడు దశరథ్. అప్పుడు దీప ఫుల్ ఎమోషనల్ అవుతుంది. పెళ్లయిన జంటకు కానుకు ఇవ్వాలని కానీ తన దగ్గర ఇప్పుడు ఏం లేదని శివన్నారాయణ అంటాడు. ఆడదాని అయిదో తనానికి గుర్తుగా బతికిినంత కాలం గుండెల మీద వేలాడే తాళిని ఇచ్చారు, ఇంతకంటే గొప్ప కానుక ఏముంది? ఇది చాలు. మీ ప్రేమ చాలు అని దీప అంటుంది. దీపకు నిజం తెలిసిపోయిందేమో అని అనుకుంటుంది జ్యోత్స్న.

రేపు మా ఇంట్లో సత్యనారాణయ వ్రతం కుటుంబంతో సహా రావాలని కాంచన ఆహ్వానిస్తుంది. శివన్నారాయణ ఇంటి నుంచి అందరూ వెళ్లిపోతారు. రాత్రి కుబేర ఫొటో ముందు దీపం వెలిగించి తమ్ముడు నీ కూతురు పెళ్లి చూసే ఉంటావు. నీ పెంపకం చాలా గొప్పది. నువ్వు కన్న తండ్రివి కాదని తెలిసినా అంత ప్రేమ ఏంటీ? దీప నీకు బంతిలో ఆకు వేసి భోజనం పెట్టిందని అనసూయ అంటుంది....