భారతదేశం, జూలై 17 -- కార్తీక దీపం 2 టుడే జూలై 17వ తేదీ ఎపిసోడ్ లో పారిజాతంపై ఫైర్ అవుతుంది జ్యోత్స్న. తాత నువ్వు డైరెక్ట్ గా అడిగినప్పుడు చెప్పేయ్ అని సైగ చేస్తే చెప్పొద్దు అని అర్థమైందా? గౌతమ్ మంచివాడు అని చెప్పిందే నేను, ఇప్పుడు చెడ్డవాడు అని చెప్తే దీప మంచిది అని అర్థమవుతుంది. ఎలాగైనా ఈ ఎంగేజ్మెంట్ ఆగిపోవాలి అని జ్యో అంటుంది.

కాశీ విషయంలో జ్యోత్స్న తీరు చూశాక ఆ మనిషి మీద జాలి పడటం అనవసరం బావ అని కార్తీక్ తో అంటుంది దీప. అది ముందే చెప్పానని కార్తీక్ అంటాడు. కాశీని అడ్డుపెట్టుకుని ఎంగేజ్మెంట్ ఆపాలనుకున్నావని నాకు తెలుసు. దాసు బాబాయి కూతురివి అని కూడా తెలుసు. నిజాలు ఒప్పుకో అని జ్యోత్స్నను బెదిరించు అని దీప చెప్తుంది. అప్పుడు పారుతో సహా అందరినీ జ్యోత్స్న చంపేస్తుంది. నీ మీద కేసు పెట్టి జైలులో పెట్టిస్తుంది. ఆస్తులన్నీ అమ్ముకుని విదేశాలకు...