భారతదేశం, జనవరి 29 -- కార్తీక దీపం 2 సీరియల్ టుడే జనవరి 29 ఎపిసోడ్ లో మనం తొందరపడ్డామో దొరికిపోతామని పారుతో జ్యోత్స్న అంటుంది. ఆల్రెడీ దొరికిపోయాం. నీ రిపోర్ట్స్ ఎప్పుడైతే మ్యాచ్ అవ్వలేదో అప్పుడే సగం దొరికిపోయినట్లు. దశరథ ముఖం చూస్తే ఏదో అనుమానం వచ్చినట్లే ఉందని పారు అంటుంది. లోపల భయం ఉంటే ఎవరి ముఖం చూసినా అలాగే ఉంటుందని జ్యో అంటుంది.

ఆస్తి ఇంకా మనది కాలేదు. నువ్వు సపోర్ట్ చేస్తే చాలని పారుతో జ్యోత్స్న అంటుంది. ఏంటీ సపోర్ట్ చేసేదని పారు ఫైర్ అవుతుంది. మీ నాన్న ఉంటే ఏదో ఒకటి చేసేదాన్ని. దాసుగాడు ఏమైపోయాడో కూడా అర్థం కావడం లేదని పారు అంటుంటే రౌడీల నుంచి కాల్ వస్తుంది. దాసు మాట్లాడతాడు. ప్లాన్ ఫెయిల్ అయిందంట కదా. నీ బుద్ధి మారడం లేదు. నువ్వు మాత్రం రాక్షసివేనని దాసు షాకిస్తాడు.

ఈ కథలో నా అల్లుడు కార్తీక్ బ్రహ్మ దేవుడు. వాడి నుంచి నువ్వు తప...