Hyderabad, ఆగస్టు 2 -- కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో దీపను అక్రమ సంతానం అన్న తండ్రి శ్రీధర్‌పై కోపంతో ఊగిపోతాడు కార్తీక్. మాకు నువ్వు సాయం చేసేదేమైనా ఉందంటే.. వెళ్లిపోండి అని కార్తీక్ అరుస్తాడు. దాంతో శ్రీధర్ షాక్ అవుతాడు. వెళ్లమని చెబుతున్నాడుగా.. వెళ్లండి అని కాంచన అంటుంది. దాంతో శ్రీధర్ బాధగా వెళ్లిపోతాడు.

కార్తీక్ అన్న మాటలు తలుచుకుని బాధపడుతాడు శ్రీధర్. దీప ఫీల్ అవుతుంటే కార్తీక్ ఓదార్చుతాడు. నువ్ ఏడుస్తున్నావంటే అతని మాటలకు విలువ ఇస్తున్నట్లేగా. ఆయన మా నాన్నే కాబట్టి నేను క్షమాపణ చెబుతున్నాను అని కార్తీక్ అంటాడు. ఇంతలో కాంచన వచ్చి తను నా భర్త అనేగా ఇదంతా చేశాడు. నేనే నీకు సారీ చెప్పాలి అని కాంచన అంటుంది.

ఎవరు చెప్పాల్సిన అవసరం లేదని దీప అంటుంది. శ్రీధర్ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని అనసూయ అంటుంది. ఇంతలో శౌర్య వచ...