Hyderabad, అక్టోబర్ 13 -- కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో నా వైపు ఉండి యుద్ధం చేస్తావా. కత్తి మనిషి అయితే ఎలా ఉండాలో అలా ఉండాలి. నీలా ఉండాలి. ఈ తాత నిన్ను రెండు కోరికలు కోరుతున్నాడు. తీరుస్తావా అని చేయి ఇస్తాడు శివ నారాయణ. ఇదే చేత్తో ముద్దు చేశావ్. ఎన్నో చేశావ్. నీకు మాట ఇవ్వలేన తాత అని మాటిస్తాడు కార్తీక్.

కార్తీక్ చేయిని గుండెకు హత్తుకుని ఈ ఒక్క మాటతో నేను బతకడానికి కావాల్సినంత బలాన్ని ఇచ్చావురా అని శివ నారాయణ అంటాడు. నా మొదటి కోరిక.. ఈరోజు బోర్డ్ మెంబర్స్ ముందు కార్తీక్ మన కంపెనీలోనే ఉంటాడు అని నేను చెప్పిన మాటని నువ్వు నిజం చేయాలి అని శివ నారాయణ అంటే.. అదేలా సాధ్యం తాత. నేను మీ డ్రైవర్‌ను అని కార్తీక్ అంటాడు.

సాధ్యమయ్యేలా నేను చేస్తాను కదరా అని శివ నారాయణ అంటే సరే అంటాడు కార్తీక్. మీ అత్తమామల దూరం తగ్గిపోవాలి. వారిని ఇనుపటి...