Hyderabad, సెప్టెంబర్ 22 -- కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో కాశీ పోలీస్ స్టేషన్‌లో పడటం గురించి చెప్పకపోవడంతో జ్యోత్స్నపై ఉగ్రరూపం చూపిస్తుంది పారిజాతం. నువ్వు, నేను, నా కొడుకు, మనవడు మనమే బాగుండాలి. దానికి కోసం ఎవరినైనా నాశనం చేస్తాను గానీ నా రక్తానికి ద్రోహం చేయను. అందుకే పేదింట్లో బతికే దాన్ని ఈ కోట్ల ఆస్తికి యజమానురాలిని చేశాను అని పారిజాతం మండిపడుతుంది.

నువ్వు ఒక్కదానివి బాగుంటే సరిపోదే. వాళ్లు కూడా బాగుండాలిగా. చిన్న సాయం అడిగితే నీకు పగ గుర్తొచ్చిందా. నా అల్లుడు హెల్ప్ చేశాడు కాబట్టి సరిపోయింది. లేకుంటే నా మనవడు జైలులో ఉండేవాడు అని పారు అంటుంది. మావయ్యతో అలా చేయమని చెప్పింది నేనే అని జ్యోత్స్న అబద్ధం చెబుతుంది. అది ముందే చెప్పొచ్చుగా. నిజం తెలియకుండా నిన్ను కొట్టాను అని పారు అంటుంది.

ఎవరి ఎలా లొంగదీయాలో నాకు బాగా తెలుసు ...