Hyderabad, ఆగస్టు 21 -- కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో ఇంటికి ఎందుకు వచ్చారని శ్రీధర్‌ను అడుగుతుంది పారిజాతం. నేను ఒక్కన్నే కాదు ఫ్యామిలీ మొత్తం వచ్చామని కాంచన, అనసూయ, శ్రుతి వస్తుంటారు. వీళ్లంతా ఎందుకొచ్చారని పారు అంటే.. రేపే కదా పెళ్లి, సందడిగా ఉండాలని రప్పించాను అని కార్తీక్ అంటాడు.

మీ తాత చూస్తే తిడతాడురా అని పారు అంటే ఎందుకు తిడతాడు. నువ్వే రమ్మన్నవాని చెబుతాను అని కార్తీక్ అంటాడు. దాంతో పారిజాతం తెగ భయపడిపోతుంది. ఇంతలో శివ నారాయణ వస్తే పక్కకు వెళ్లి దాక్కుంటుంది. వీళ్లను ఎవరు రమ్మన్నారని సుమిత్ర అడిగితే.. నేనే రమ్మన్నాను అని శివ నారాయణ అంటాడు. వీళ్లను పిలిచింది ముసలోడా. రేయ్ కార్తీక్ నువ్ ఖతర్నాక్‌రా అని పారు అంటాడు.

ఏమైనా చెప్పడానికి పిలిపించారా అని జ్యోత్స్న అంటే లేదు ఉండటానికి అని శివ నారాయణ అంటాడు. పద్ధతి ప్రకారం మొగ...