భారతదేశం, ఆగస్టు 5 -- కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఆగస్టు 5వ తేదీ ఎపిసోడ్ లో శివన్నారాయణతో ఆస్తి పంపకాల గురించి మాట్లాడుతుంటాడు శ్రీధర్. వజ్రాలహారం మాత్రం కాంచనకే దక్కాలని అంటాడు శ్రీధర్. మామయ్య అంటూ మనసు కరిగించి వచ్చిన ఆస్తి కొట్టేయాలని చూడకు అని దీపతో శ్రీధర్ అంటాడు. నా కొడుకు ఎన్నో సార్లు ఆపాడు, అందుకే ఇప్పుడు చెప్పకుండా చేశానని అసలు విషయం చెప్తాడు శ్రీధర్. రిజిస్ట్రేషన్ ఎప్పుడు పెట్టుకుందాం అని శ్రీధర్ అనగానే శివన్నారాయణ ఫైర్ అవుతాడు.

నీ కొడుకు నిన్ను పిలిపించుకుంది ఈ నోటీస్ తో తనకు, అమ్మకు సంబంధం లేదని నిరూపించేందుకే. ఆస్తి మొత్తం ఏనాడో నా కొడుకు పేరు మీద రాసేశానని శివన్నారాయణ శ్రీధర్ పై కోప్పడతాడు. నా వాట ఎంతోస్తే అంత ఇవ్వండని అడుగుతాడు శ్రీధర్. నువ్వెవరు అడగడానికి? అడిగితే నా కూతురు అడగాలి. నేను ఇవ్వాలని శివన్నారాయణ మండిపడుతాడు. క...