భారతదేశం, జూన్ 24 -- కార్తీక దీపం 2 ఈ రోజు ఎపిసోడ్ లో మన కంపెనీ రూల్స్ మార్చి రాశాను అని శివన్నారాయణకు దశరథ్ చూపిస్తాడు. కార్తీక్ చెక్ ఇచ్చిన సీన్ నే శివన్నారాయణ గుర్తు చేసుకుంటాడు. తాత నా మీద ఇంకా కోపం పోలేదా? అని జ్యోత్స్న అంటే.. కార్తీక్ గురించి ఆలోచిస్తున్నా అని శివన్నారాయణ అంటాడు. అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయాలని అడగాలి లేదా డబ్బో, నగలో అడగాలి.. చెక్ ఏమో జ్యోకు ఇచ్చాడు అని శివన్నారాయణ చెప్తాడు. నేను ఇచ్చిన చెక్ మీద కోట్లు రాసుకుని కార్లు, బంగళాలు కొనుక్కోవచ్చు అలాంటిది నేను ఇచ్చిన సెకండ్ హ్యాండ్ స్కూటీ ఎందుకు తీసుకున్నాడని శివన్నారాయణ అంటాడు.

అగ్రిమెంట్ కోసమే ఇంటికి వచ్చినట్లు అనిపించడం లేదూ అని కార్తీక్ గురించి శివన్నారాయణ అనుమానం వ్యక్తం చేస్తాడు. నాన్న వాడికి మనమంటే ప్రేమ నాన్న అని దశరథ్ అంటే.. నీ కూతురును కాదని దీప మెడలో తాళి కట్టి...