Hyderabad, జూలై 19 -- కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో కాశీతోనే జ్యోత్స్నకు దిమ్మతిరిగేపోయేలా చేశావ్ అని కార్తీక్‌ను మెచ్చుకుంటుంది దీప. ఇప్పటికీ కూడా జ్యోత్స్న వేరే దారి వెతుకుతుందని కార్తీక్ అంటాడు. మరోవైపు కాశీకి జ్యోత్స్న కాల్ చేస్తే కట్ చేసి కార్తీక్‌కు ఫోన్ చేసి చెబుతాడు. అప్పుడు మళ్లీ జ్యోత్స్న కాల్ చేస్తుందని చెబుతాడు.

కాల్ కాన్ఫరెన్స్‌లో పెట్టు, నేను లేనట్లు మాట్లాడు అని కార్తీక్ అంటాడు. దాంతో కాశీ అలాగే చేస్తాడు. ఏంట్రా నన్నే మోసం చేశావ్. గౌతమ్ గాడి ప్రూఫ్స్ అనుకున్నాను అని జ్యోత్స్న అంటే గౌతమ్ గురించి నాకు ఏం తెలియదు అని కాశీ అంటాడు. మరదలికి బాగా మండుతున్నట్లు ఉందని కార్తీక్ అనుకుంటాడు.

ఆడురా, మీ బావ చెప్పినట్లు వాడు. మీరంతా కలిసిపోతే నేను భయపడతాననుకుంటున్నారా. నీ దగ్గర గౌతమ్ గాడి వీడియోలు ఉన్నాయని నాకు తెలుసు అని జ్య...