Hyderabad, జూలై 5 -- కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో అప్పులు చేసే అల్లుడుని నా కూతురుకి కట్టబెట్టి గొంతు కోసింది దీప అని శ్రీధర్ అంటాడు. మాకు పనులు ఉన్నాయి. జ్యోత్స్న నిశ్చితార్థానికి ముహుర్తాలు పెట్టారు. వచ్చే బుధవారం గౌతమ్‌తో ఎంగేజ్‌మెంట్ అని చెప్పి పారిజాతం కాల్ కట్ చేస్తుంది. అదే విషయం కావేరికి చెబుతాడు శ్రీధర్.

ఆ గౌతమ్ చెడ్డవాడు కదా. జ్యోత్స్న పెళ్లికి ఎందుకు ఒప్పుకుంది. ఏదైనా ప్లాన్ చేయబోతుందా అని కావేరి మనసులో టెన్షన్ పడుతుంది. ఈ ఎంగేజ్‌మెంట్ జరగదు అని కావేరి అనడంతో ఎందుకు జరగదు అని శ్రీధర్ అడుగుతాడు. కావేరి తప్పించుకుందామనుకుంటుంది కానీ, శ్రీధర్ వదలడు. దీపను ఇరికించే ప్లాన్ చేస్తున్నట్లుంది. వెంటనే చెప్పాలి అని కావేరి మనసులో అనుకుని వెళ్లిపోతుంది.

నీ భార్య అంతరంగం ఏంటో కనిపెట్టాలి. నిశ్చితార్థం ఎందుకు జరగదు అని శ్రీధర్ ...