భారతదేశం, సెప్టెంబర్ 4 -- కార్తీక దీపం 2 సీరియల్ టుడే సెప్టెంబర్ 4వ తేదీ ఎపిసోడ్ లో కార్తీక్, శివన్నారాయణ కార్లో వెళ్తారు. కారు ఆపి కార్తీక్ ను జరిగిన దాని గురించి మీ అమ్మ ఏమంటుంది? మేం వచ్చేసిన తర్వాత ఏమంది? అని శివన్నారాయణ అడుగుతాడు. మీ స్వార్థం కోసమే పెళ్లి చేశారని, మీ మనవరాలి తప్పు కప్పి పుచ్చుకోవడం కోసమే కానీ కూతురిపై ప్రేమ లేదని అని కార్తీక్ చెప్తుంటే శివన్నారాయణ ఆపుతాడు. ఇవి మీ మాటలా? మీ అమ్మ మాటలా అని శివన్నారాయణ అంటే.. తల్లి కాంచనకు కాల్ చేస్తాడు కార్తీక్.

నిన్న జరిగింది నువ్వు మర్చిపోయినట్లే కదా అని కాంచనను కార్తీక్ అడుగుతాడు. ఎలా మర్చిపోదాం రా? వాళ్లు విషం దాచుకుని బతుకుతున్నారని కాంచన అంటే.. తాత ఏ తప్పు చేయలేదు కదా అని కార్తీక్ అంటాడు. మా నాన్న తప్పు చేయకపోవడం ఏంటీ? ఆయన అర్థం లేని ఆవేశమే అన్ని అనార్థాలకు కారణం. మా అన్నయ్య తండ...