Hyderabad, జూలై 3 -- కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో కూతురు కాంచన ఇంటికి వెళ్లిన శివ నారాయణ నీతి కథ చెబుతాడు. అది విన్న కార్తీక్ సూపర్ సర్ అని చప్పట్లు కొడతాడు. పిల్లలు వినే కథలోనే అహంకారం ఉండకూడదని చెప్పే మీరు నిజ జీవితంలో ఎందుకు పాటించట్లేదో అని కార్తీక్ అంటాడు. బావ నువ్ మా తాతతో మాట్లాడుతున్నావని గుర్తు పెట్టుకో అని అంటుంది.

నువ్ మా బావతో మాట్లాడుతున్నావని గుర్తుపెట్టుకో అని దీప అంటుంది. స్థానాలను బట్టి గుర్తులు మారిపోతాయి. మేము వచ్చింది మీకోసం కాదు అని శివ నారాయణ అంటాడు. నా మీదున్న చెడ్డపేరు పోగొట్టుకునేందుకు తాతను బతిమిలాడి మరి ఇక్కడికి తీసుకొచ్చాను అని జ్యోత్స్న మనసులో అనుకుంటుంది. మరి ఎవరి కోసం వచ్చారని కార్తీక్ అడిగితే ఈమె కోసం అని కూతురుని చూపించిన శివ నారాయణ ఇప్పుడు ఎలా ఉందని అడుగుతాడు.

బాగానే ఉంది నాన్నా అని కాంచన అన...