భారతదేశం, డిసెంబర్ 8 -- కార్తీక దీపం 2 టుడే డిసెంబర్ 8 ఎపిసోడ్ లో దీప గురించి ఎక్కువగా ఆలోచించొద్దని కాంచనకు చెప్తుంది అనసూయ. అప్పుడే వచ్చి అత్తయ్య అని పిలుస్తుంది దీప కానీ కాంచన సరిగ్గా రియాక్ట్ కాదు. అత్తయ్య నువ్వు చెప్పిన ప్రతి మాట నా క్షేమం గురించి చెప్పిందే. శౌర్య నా కూతురే. ఇది కూడా నా బిడ్డే కదా. మీరే ఆశలు పెట్టుకుంటే నేను ఎన్ని ఆశలు పెట్టుకుంటారని దీప ఎమోషనల్ అవుతుంది.

నీకు మాటిస్తున్నా అత్తయ్య నీ కొడుకు వారసత్వాన్ని నీ చేతుల్లో పెట్టే బాధ్యత నాది. కానీ నేను ఆ ఇంటికి వెళ్లాలి అని దీప మళ్లీ షాక్ ఇస్తుంది. మాట విన్నావు అనుకున్నా కానీ మొండి పట్టుదల వదల్లేదని కాంచన అంటుంది. అది నా పుట్టినల్లే అత్తయ్య. ఏం జరగదు అత్తయ్య అని దీప అంటుంది. ఇంటి దగ్గర ఉంటే అవిటి దానికి సేవలు చేయాలనుకుంటున్నావు కదా అని కాంచన అనగానే దీప ఆమె కాళ్ల మీద పడిపోతు...