భారతదేశం, జూలై 10 -- కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ లో ఎంగేజ్మెంట్ రింగులను సుమిత్రకు ఇస్తాడు కార్తీక్. పారిజాతాన్ని కాసేపు ఆడుకుంటాడు. అందరి ముందు పరువు తీసేస్తాడు. దీంతో దీప నవ్వుకుంటుంది. ఈ ఉంగరాలు ఎందుకు తీసుకు వచ్చావు అని కార్తీక్ ను అడుగుతుంది దీప. నువ్వేం భయపడకు, భయపడాల్సిన వాళ్లు వేరే ఉన్నారని కార్తీక్ అంటాడు.

గౌతమ్ ను రెచ్చగొట్టి దీపను చంపాలనుకున్న దాన్ని, మ్యారేజ్ పోస్ట్ పోన్ చేయించలేనా అని కాల్ చేసేందుకు ట్రై చేస్తుంది జ్యోత్స్న. ఇంతలో సుమిత్ర తీసుకొచ్చిన ఎంగేజ్మెంట్ రింగ్స్ చూసి జ్యో షాక్ అవుతుంది. మరోసారి ఎలాంటి ఆటంకం జరగొద్దని, భద్రాచలంలో పూజలు చేయించిన ఉంగరాలు ఇవి. ఇక మీ నిశ్చితార్థాన్ని ఎవరూ ఆపలేరు. ఒకసారి చూసి నచ్చాయో లేదో చెప్పు అని సుమిత్ర అంటుంది. నువ్వు ఎంగేజ్మెంట్ అనగానే భయపడుతున్నావు కదూ అని సుమిత్ర అనగానే జ్యో కంగారు...