భారతదేశం, జనవరి 10 -- కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో సుమిత్రకు బ్లడ్ క్యాన్సర్ అని నిజం చెప్పడంపై కాంచన తిడుతుంది. శివ నారాయణ కూడా తిడతాడు. దశరథ్‌ను ఏం అనకండి నాన్న. తల్లి జబ్బు పడితే అర్ధరాత్రి ఎవరికి తెలియకుండా వెళ్లినప్పుడే జ్యోత్స్న ఏంటో అర్థమైంది. నేను ఇక ఈ ఇంట్లో ఉండను నాన్న అని దశరథ్ అంటాడు.

ఇప్పటికే సగం భయంతో బతుకుతున్నాను. నా వాళ్లు అంతా నాతో ఉన్నారనిపించింది. కానీ, ఇప్పుడు ఆ ఆశ కూడా పోయింది. మీరంత చూశారు కాబట్టి నయమైంది. లేకపోతే ఏడుస్తున్న నా భార్యకు ఏమని చెప్పి ఓదార్చాలి. కూతురు పెళ్లి కోసం తల్లి పరితపిస్తుంటే తల్లి చావు కోసం కూతురు చూస్తుంది అని దశరథ్ అంటాడు.

నేను అంత కసాయిదాన్ని కాదు. రేపైనా మీరు చెప్పాల్సిందేగా అని జ్యోత్స్న అంటుంది. అందుకేనా పక్కన కూర్చుని చెబుతున్నావ్. పారు నువ్వైనా వద్దని చెప్పాలిగా అని కార్తీ...