భారతదేశం, జనవరి 8 -- కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో దీపను శ్రీధర్ ఇంటికి తీసుకొస్తాడు. ఏమైందని కాంచన అడుగుతుంది. దీప ఏడుస్తూ కుప్పకూలిపోతుంది. పంతులు గారు చెప్పిన గండం వచ్చేసింది. సుమిత్రను చుట్టుముట్టుంది అని దీప అంటే.. చెల్లెమ్మకు బ్లడ్ క్యాన్సర్ అని శ్రీధర్ చెబుతాడు.

రోగం ఎంత తట్టుకోలేమో చికిత్సను కూడా అంతే తట్టుకోలేం. అది విని చెల్లెమ్మ తట్టుకోగలదా. తనను అంతా ప్రిపేర్ చేస్తున్నారని శ్రీధర్ అంటాడు. కన్నతల్లికి కష్టం వచ్చినట్లుగా దీప ఎలా తల్లడిల్లిపోతుందో అని కాంచన అంటుంది. నువ్వే మీ అన్నయ్యకు ధైర్యం చెప్పాలని కాంచనకు, నీ బాధ కడుపులో ఉన్న బిడ్డ తట్టుకోలేకపోవచ్చు. ఎక్కువగా బాధపడకు అని శ్రీధర్ చెప్పి వెళ్లిపోతాడు.

మరోవైపు బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ గురించి తెగ వణికిపోతుంది జ్యోత్స్న. ఈ గండం నుంచి బయటపడాలంటే ముందు ఇంట్లోంచి బ...