భారతదేశం, ఆగస్టు 4 -- కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఆగస్టు 4వ తేదీ ఎపిసోడ్ లో నువ్వు ఎలా అనాథవు అయింటావని దీపను జ్యోత్స్న అడుగుతుంది. చాలా కాలం క్రితం జరిగిన కథ అంటూ కృష్ణుడి స్టోరీ చెబుతుంది దీప. అంటే మీ నాన్నే నిన్ను వదిలేశాడంటావా అని జ్యో అంటే.. ఏమో మా నాన్నకు ఉన్న శత్రువులే నన్ను చంపాలని అనుకోవచ్చు కదా అని దీప అంటుంది. దీంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. ఆ దేవుడి దయ వల్ల చావు నుంచి తప్పించుకుని ఉండొచ్చు కదా అని దీప అంటుంది.

అసలైన మీ అమ్మానాన్న ఎవరో నీకు తెలియదా అని జ్యోత్స్న ప్రశ్నిస్తే తెలియదు అని దీప చెప్తుంది. ఏమో ఏదో ఒక రోజు అసలైన నా అమ్మానాన్నను చేరుకుంటానేమో అని దీప అనగానే జ్యోత్స్న కంగారు పడుతుంది. దీపకు నిజం తెలుసో లేదో కనుక్కునేందుకు జ్యో ఆరా తీస్తుంది. కొన్నిసార్లు వాళ్లకు దగ్గరగా ఉండొచ్చు, కానీ అమ్మానాన్న అని తెలియకపోవచ్చని చెప్ప...