భారతదేశం, నవంబర్ 4 -- కార్తీక దీపం 2 టుడే నవంబర్ 4 ఎపిసోడ్ లో నువ్వు ఈ ఇంటి వారసురాలివి కాదని తెలిసే రోజు చాలా దగ్గర్లోనే ఉందని జ్యోత్స్నకు వార్నింగ్ ఇస్తుంది పారిజాతం. అది తెలిసిన రోజు నిన్నయితే ఏం చేస్తారో తెలియదు. అందుకే దాసును పిలిచి నీ కూతురిని నువ్వు తీసుకుపోరా అని అంటా. అప్పుడు నీకు ఆస్తికి ఏం సంబంధం ఉండదు. చిన్నప్పుడు తప్పిపోయిన కూతురు వస్తే ఆస్తి మొత్తం తనకే కట్టబెడతారని పారు అంటుంది.

సుమిత్ర కూతురు బతికే ఉందని దాసు చెప్పిన విషయం నిజమే అయితే నువ్వు వారసురాలివి కాదని బయటపడిన తర్వాత అసలైన వారసురాలు బతికే ఉందని దాసు చెప్పేస్తాడు కదా. అప్పుడు అసలైన యువరాణి కోసం వేట మొదలవుతోంది. అది దొరికిందే అనుకో ఆస్తి మొత్తం దానికి. అప్పుడు నువ్వు ఆటోలు మారుతూ ఉద్యోగం అంటూ తిరుగుతూ ఉండాలి. ఎందుకంటే దాసు దగ్గర డబ్బులు లేవు. వీలైనంత త్వరగా పెళ్లి చే...