భారతదేశం, డిసెంబర్ 5 -- కార్తీక దీపం 2 టుడే డిసెంబర్ 5 ఎపిసోడ్ లో రేపటి నుంచి దీప మా ఇంటికి రానవసరం లేదని దశరథ అంటాడు. తన ఆరోగ్యం గురించి డాక్టర్ ఇంతకుముందే చెప్పారు. ఇప్పుడు మరోసారి ఎలాంటి పరిస్థితుల్లో ఉందో అర్థమైంది. అందుకే రేపటి నుంచి మా ఇంటికి రానవసరం లేదని సుమిత్ర కూడా చెప్తుంది. కాంచన, శివన్నారాయణ కూడా అదే మాట అంటారు. ఖర్చులన్నీ నేనే చూసుకుంటా, అవసరమైతే పని మనిషిని పెడతానని శివన్నారాయణ అంటాడు.

దీపను మన ఇంటికి వచ్చేలా చేయ్ అని పారిజాతంతో జ్యోత్స్న చెప్తుంది. వెంటనే దీప మన ఇంటికి వస్తే సరిపోతుంది కదా అని స్టార్ట్ చేస్తుంది పారు. థ్యాంక్స్ అత్త మీరు అర్థం చేసుకున్నందుకు, పెద్ద మేడం మీరు ఏమంటారు? అని జ్యోత్స్నను అడుగుతాడు కార్తీక్. మా మాటే తన మాట. కార్పొరేట్ కంపెనీలో మెటర్నిటీ లీవ్ ఇస్తారు కదా ఇది కూడా అలాగే అని దశరథ అంటాడు.

నేను సెల...