భారతదేశం, నవంబర్ 24 -- కార్తీక దీపం 2 టుడే నవంబర్ 24 ఎపిసోడ్ లో స్వప్న, కాశీ గొడవ పడుతుంటారు. అసలు మీ మధ్య ఏం జరుగుతుంది? అని కార్తీక్ వచ్చి అడుగుతాడు. కాశీ ఆపుతుంటే స్వప్న నిజం చెప్పేస్తోంది. జాబ్ లేకపోయినా వచ్చినట్లు అబద్దం చెప్పి కాశీ నన్ను మోసం చేశాడన్నయ్యా అని స్వప్న ఎమోషనల్ అవుతుంది. కాశీ కవర్ చేసేందుకు ప్రయత్నిస్తాడు. మాట్లాడితే కొడతానని స్వప్న సీరియస్ అవుతుంది.

ప్రేమకు, ప్రేమించిన మనిషికి విలువ ఇవ్వని ఇలాంటి మనిషి నాకు అవసరం లేదన్నయ్యా అని స్వప్న అంటుంది. ఓ మనిషిని వదిలేసేందుకు వంద కారణాలు ఉండొచ్చు. కానీ మనిషిని కలుపుకోవడం మాత్రం అంత తేలిక కాదు స్వప్న. మోసాన్ని నేను, మీ ఆయన కూడా భరించలేడు. మన ముగ్గురి లక్షణాలు ఒకటి. కానీ కొన్నిసార్లు ఆలోచించాలి. దీపను జ్యోత్స్న నెట్టేసింది. లాగిపెట్టి కొట్టాలన్నంత కోపం వచ్చింది. కానీ కొట్టలేను. ద...